Advertisementt

మోహన్ బాబు కొత్త చిత్రం సన్ ఆఫ్ ఇండియా..

Sat 15th Aug 2020 11:20 AM
mohan babu,son of india,diamond ratna babu,lakshmi prasanna pictures  మోహన్ బాబు కొత్త చిత్రం సన్ ఆఫ్ ఇండియా..
Mohan Babu New film Son Of India.. మోహన్ బాబు కొత్త చిత్రం సన్ ఆఫ్ ఇండియా..
Advertisement
Ads by CJ

సీనియర్ నటుడు మోహన్ బాబు కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్ ఆఫ్ ఇండియా పేరుతో టైటిల్ పోస్టర్ తో వచ్చాడు. గాయత్రి తర్వాత మహానటి సినిమాలో ఎస్వీ రంగారావుగా కనిపించాడు. అనంతరం మోహన్ బాబు వెండితెర మీద మళ్ళీ కనిపించలేదు. ప్రస్తుతం తమిళ నటుడు సూర్య నటిస్తున్న ఆకాశం నీ హద్దురా చిత్రంలో కీలక పాత్రలో చేసాడు. ఈ చిత్రం కరోనా కారణంగా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

తాజాగా సన్ ఆఫ్  ఇండియా అంటున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా పనిచేసి దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ బాబు స్వంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పోస్టర్ ని చూస్తుంటే ఈ చిత్రం సమాజానికి సందేశాన్నిచ్చే విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఒకవైపు మాత్రమే కనిపిస్తున్న మోహన్ బాబు మొహంలో ఉక్రోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

మరి సన్ ఆఫ్ ఇండియాగా మోహన్ బాబు పాత్ర ఏ అంశాలని చూపిస్తుందో చూడాలి.  సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటులు ఎవరనేది త్వరలో ప్రకటిస్తారట.

Mohan Babu New film Son Of India..:

Mohan Babu New film Son Of India..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ