Advertisementt

ఆకట్టుకుంటున్న గుడ్ లక్ సఖి టీజర్..

Sat 15th Aug 2020 10:55 AM
good luck sakhi teaser,keerthy suresh,devi sri prasad,jagapathi babu  ఆకట్టుకుంటున్న గుడ్ లక్ సఖి టీజర్..
Keerthy Sureshs Good Luck Sakhi Teaser.. ఆకట్టుకుంటున్న గుడ్ లక్ సఖి టీజర్..
Advertisement
Ads by CJ

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్న కీర్తి సురేష్, తన తర్వాతి చిత్రాలన్నీ నటనా ప్రాధాన్యమున్న వాటినే ఎంచుకుంటుంది. అందులో భాగంగానే పెంగ్విన్ చిత్రం వచ్చింది. అయితే ఆ చిత్రం ప్రేక్షకులని అంతగా ఆకర్షించలేదు. ప్రస్తుతం మరో వివిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గుడ్ లక్ సఖి అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఈరోజే విడుదలైంది.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలైన ఈ టీజర్ లో దేశభక్తికి సంబంధించిన ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. బంజారా అమ్మాయిగా కీర్తి సురేష్ చాలా చక్కగా కనిపించింది. టీజర్ లో చూపించిన ప్రకారం కీర్తి సురేష్ పాత్రని దురదృష్టం అంటిపెట్టుకునే ఉంటుందని తెలుస్తుంది. అందువల్ల ఆ గ్రామంలోని జనాలందరూ ఆ పాత్రని బ్యాడ్ లక్ గా భావిస్తున్నట్లుగా ఉంది.

అయితే బ్యాడ్ లక్ ని అంటిపెట్టుకునే అమ్మాయి గుడ్ లక్ సఖి అనేలా ఎదిగేందుకు ఏది కృషి చేసిందనేది ఆసక్తిగా ఉంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో ప్రాధాన్యమున్న పాత్రలో చేస్తున్నాడు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, టీజర్ తో ఆసక్తి రేపుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుందో లేక థియేటర్లు తెరుచుకునే వరకు వెయిట్ చేస్తుందో చూడాలి. 

click here for Teaser

Keerthy Sureshs Good Luck Sakhi Teaser..:

Keerthy Sureshs Good Luck Sakhi Teaser..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ