గత కొన్ని రోజులుగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ఇంటి వారవుతున్నారు. రానా దగ్గుబాటి, నితిన్, నిఖిల్.. తమ జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిన్నటికి నిన్న నాగబాబు కూతురు నీహారిక కొణిదెల నిశ్చితార్థం చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. ఇదంతా చూస్తుంటే ఈ సంవత్సరం మొత్తం టాలీవుడ్ లో పెళ్ళి బాజాలతో నిండిపోయినట్టు అనిపిస్తుంది.
తాజాగా మరో టాలీవుడ్ హీరో పెళ్ళి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ తన జీవితంలో పెద్ద స్టెప్ తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా ఈ మాటలు మాట్లాడిన సందీప్, ఈ సంవత్సరం తన జీవితంలో చాలా విషయాలని పునఃసమీక్షించుకునేలా చేసిందని, ఇంకా ఏదైతే తనని హ్యాపీగా ఉంచుతుందో ఆలోచించేలా చేసిందని తెలిపాడు.
జీవితంలో అతి ముఖ్యమైన పెద్ద స్టెప్ తీసుకోబోతున్నానని, ఆ విషయం గురించి మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాని పోస్ట్ పెట్టాడు. ఈ సోమవారం సందీప్ కిషన్ జీవితంలో తీసుకోబోయే పెద్ద స్టెప్ ని అభిమానులతో పంచుకోనున్నాడు. అయితే ఆ పెద్ద స్టెప్ పెళ్ళి గురించే అయి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.