Advertisementt

అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆ న్యూస్ నిజం కాదంట!

Sat 15th Aug 2020 11:40 PM
akkineni compound,akhil akkineni,surender reddy,combo,not true  అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆ న్యూస్ నిజం కాదంట!
No Movie in Akhil Akkineni and Surender Reddy Combo అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆ న్యూస్ నిజం కాదంట!
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని నటించిన మూడు సినిమాలు ప్లాప్స్ అయ్యి మైండ్ బ్లాంక్ అయ్యింది. మొదటి సినిమాకే మాస్ హీరో అవుదామనుకుంటే.. అది అట్టర్ ప్లాప్ కాగా.. రెండో సినిమా, మూడో సినిమాని క్లాసిక్ లవర్ బాయ్‌లా అయినా సక్సెస్ అవుదామనుకుంటే హలో, మిస్టర్ మజ్ను కూడా ప్లాప్స్ అయ్యాయి. ఇక చేసేది లేక ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్నాడు. కొద్దిగా షూటింగ్ మిగిలి ఉండగా కరోనా మహమ్మారి బ్యాచ్‌లర్ షూటింగ్‌కి అడ్డుపడింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించడం, అఖిల్ లుక్స్ అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. అయితే తాజాగా అఖిల్.. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డితో నెక్స్ట్ సినిమా చెయ్యబోతున్నాడంటూ సోషల్ మీడియా న్యూస్.

‘కిక్’ దర్శకుడు అఖిల్‌కి కిక్ ఇస్తాడా? సైరా దర్శకుడైన అఖిల్‌ని గాడిలో పెడతాడా? రేసు గుర్రంలా అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హిట్ కొడతాడా? అంటూ రకరకాల న్యూస్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా సురేందర్ రెడ్డి‌తో అఖిల్ సినిమా లేదని... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా విడుదలయ్యాకే అఖిల్ నెక్స్ట్ సినిమాపై ప్రకటన వస్తుంది అని.. ప్రస్తుతం అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబోపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలంటూ.... అక్కినేని కాంపౌండ్ నుండి న్యూస్ వచ్చినట్లుగా మీడియా టాక్. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా విడుదలయ్యాక అది హిట్ అయ్యాకే.. ఏ జోనర్‌లో సినిమా చేయాలో ఆలోచిస్తారని అంటున్నారు. అందుకే ఏ దర్శకుడికి అఖిల్ ఇంకా కమిట్ అవ్వలేదని అంటున్నారు.  

No Movie in Akhil Akkineni and Surender Reddy Combo:

Akkineni Compound condemned the Akhil and Surender reddy combo Movie news

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ