Advertisementt

దేవకట్టా ఇంద్రప్రస్థం.. స్నేహితుల రాజకీయ పోటీ..

Fri 14th Aug 2020 10:55 AM
indraprastham,devakatta,cbn,ysr,telugu  దేవకట్టా ఇంద్రప్రస్థం.. స్నేహితుల రాజకీయ పోటీ..
Devakattas Indraprasthanam Poster video release దేవకట్టా ఇంద్రప్రస్థం.. స్నేహితుల రాజకీయ పోటీ..
Advertisement
Ads by CJ

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐకాన్స్ గా నిలిచిన డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జీవితాల నుండి ప్రేరణ పొంది కల్పిత కథగా వస్తున్న చిత్రం ఇంద్రప్రస్థం. ప్రస్తుతం ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే.  ప్రస్థానం దర్శకుడు దేవకట్టా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇద్దరు స్నేహితుల మధ్య పోటీ ఎదురైతే ఎలా ఉంటుందో చూపించబోతున్నారు.  దేవకట్టా వాయిస్ ఓవర్ లో పోస్టర్ వీడియోని రిలీజ్ చేసిన చిత్ర బృందం ఆసక్తిని రేపింది.

ప్రపంచంలో పోటీలన్నింటికీ పర్పస్ ఒక్కటే. విజేతలని ఎంచుకోవడం.. విజేతలే ప్రపంచాన్ని నడిపిస్తారు. ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులెదురైతే ఆ ఆటకున్న కిక్కే వేరు లాంటి మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.  ప్రూడోస్ ప్రొడక్షన్ బ్యానర్ లో హర్ష వి, తేజ సి నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవకట్ట దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో దేవకట్టా రూపొందిస్తున్న చిత్రం అనంతరం ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందట. ఈ పోస్టర్ వీడియోకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.

click here for Poster video

Devakattas Indraprasthanam Poster video release:

Devakattas Indraprasthanam Poster video release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ