Advertisementt

నెపోటిజంపై విమర్శలు.. రికార్డు లెవెల్లో డిస్ లైక్స్..

Fri 14th Aug 2020 09:53 AM
sadak 2 trailer,bollywood,nepotism,sushanth singh rajput   నెపోటిజంపై విమర్శలు..  రికార్డు లెవెల్లో డిస్ లైక్స్..
Most disliked video in YouTube నెపోటిజంపై విమర్శలు.. రికార్డు లెవెల్లో డిస్ లైక్స్..
Advertisement
Ads by CJ

సుశాంత్ సింగ్ బలవన్మరణం తర్వాత బాలీవుడ్ పెద్దలపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారసత్వాన్ని ప్రోత్సహిస్తూ ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన వారికి అవకాశాలు లేకుండా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చర్చలకి మరింత ఊతమిస్తూ చాలా మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం గొంతు పలకడంతో మరింత వివాదాస్పదంగా మారింది.

అయితే నెపోటిజం పై విమర్శలు స్టార్ కిడ్స్ పై చాలా ప్రభావాన్ని చూపుతున్నాయి. తాజాగా విడుదలైన సడక్ 2 ట్రైలర్ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఆలియా భట్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్ర ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో రికార్డు లెవెల్లో డిస్ లైక్స్ పడ్డాయి. యూట్యూబ్ హిస్టరీలోనే ఎప్పుడూ రానన్ని డిస్ లైక్స్ తో రికార్డులకెక్కింది. 8 మిలియన్ల మంది ఈ వీడియోని డిస్ లైక్ చేసారు.

అన్ని డిస్ లైక్స్ రావడం వెనక కారణం కేవలం అందులో స్టార్ కిడ్ అయిన ఆలియా భట్ నటించడమే. సినిమా ట్రైలర్ బాగున్నప్పటికీ ఈ రేంజ్ లో డిస్ లైక్స్ రావడం చూస్తుంటే నెపోటిజం పై విమర్శలు ఇప్పట్లో తగ్గేలా లేవు. సడక్ 2 డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 28వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవనుంది.

Most disliked video in YouTube:

Most disliked video in YouTube

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ