Advertisementt

బాలీవుడ్ లోకి తెలుగు వినాయకుడు..

Thu 13th Aug 2020 06:43 AM
vinayakudu,bollywood,telugu,krishnudu,saikiran adivi  బాలీవుడ్ లోకి తెలుగు వినాయకుడు..
Vinayakudu Bollywood remake is on cards.. బాలీవుడ్ లోకి తెలుగు వినాయకుడు..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ నిర్మాతల దృష్టి దక్షిణాది సినిమాలపై గట్టిగానే ఉంది. చాలా రోజులుగా ఇక్కడి సినిమాలని తీసుకెళ్ళి బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అవి మంచి విజయాలని అందుకుని నిర్మాతకి లాభం చేకూరుస్తున్నాయి. సో ఇక్కడి సినిమాలపై ఫోకస్ మరింత పెంచారు. ఇప్పటికే తెలుగు నుండి చాలా సినిమాలు బాలీవుడ్ రీమేక్ కి వెళ్ళాయి, జెర్సీ, భాగమతి, హిట్, మత్తు వదలరా..మొదలగు చిత్రాలన్నీ సెట్స్ మీద ఉన్నాయి.

తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చేసింది. పన్నెండేళ్ళ క్రితం తెలుగులో విడుదలైన వినాయకుడు సినిమా బాలీవుడ్ కి వెళ్ళనుంది. సాయికిరణ్ అడవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. క్రిష్ణుడు హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనియా కనిపించింది. ఊబకాయం గల అబ్బాయి నాజూకైన అమ్మాయి ప్రేమలో పడితే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చాలా చక్కగా చూపించారు.

హిందీ రీమేక్ కి కూడా సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చిందని సమాచారం. మరి ఈ సినిమాలో క్రిష్ణుడి పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ఇంకా వెల్లడి చేయలేదు. 

Vinayakudu Bollywood remake is on cards..:

Vinayakudu Bollywood remake is on cards..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ