జెంటిల్‌మన్, నిన్నుకోరి, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నివేధా థామస్‌ని పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అంటే.. ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, అలాగే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని లేదు అంటుంది. ప్రేమ, పెళ్లి అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన విషయాలే. పెళ్లి గురించి, ప్రేమ గురించి మాట్లాడడానికి నేనెప్పుడూ తటపటాయించను.. పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సంతోషంగా పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ప్రేమించే తీరిక లేదు.. పెళ్లి చేసుకునే సమయమూ లేదు. నేను ఇంకా నటిగా ప్రూవ్ చేసుకోవాలి అంటుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ నివేధా థామస్.
ఇక పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని అడిగితే... నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నిజాయితీ పరుడై ఉండాలి. బాధ్యతలను పంచుకోగలిగిన వ్యక్తులు అంటే ఇష్టం. అలాగే ప్రయాణాలను ఇష్టపడే వ్యక్తి అయితే మరీ ఇష్టమంటోంది నివేధా థామస్. ఇంకా ఆమె.. నన్ను నేను నటిగా నిరూపించుకోవాలి.. అందుకే ఎన్నో విభిన్నమైన పాత్రలు చేయాలి. తర్వాత దర్శకత్వం చేయాలి అంటూ దర్శకత్వంపై మక్కువ ఉందని చెబుతుంది నివేద థామస్. సో మొత్తంగా చూస్తే.. ఈ భామ ఫ్యూచర్‌లో డైరెక్టర్ అవ్వబోతుందన్నమాట.