కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ఇదిగో స్టార్ట్ అవుతుంది.. అదిగో స్టార్ట్ అవుతుంది.. టెస్ట్ షూట్ మొదలు పెడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ సడెన్ గా దేని గురించైతే ఎక్కువగా భయపడ్డారో అదే జరిగి అందరికీ షాక్ తగిలింది. జక్కన్న కరోనా బారిన పడ్డాడన్న వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ గా రావడంతో వైద్యుల సలహా మేరకు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడు.
అయితే పద్నాలుగు రోజుల పాటు కరోనాతో పోరాడిన రాజమౌళి చివరికి దాన్ని జయించాడు. ఈ పద్నాలుగు రోజుల పాటు ఎలాంటి లక్షణాలు కనిపించలేదట. ఏదైతేనేం మొత్తానికి రాజమౌళి కరోనా బారి నుండి తప్పించుకున్నాడు. రాజమౌళితో పాటు కుటుంబసభ్యులకి కూడా నెగెటివ్ వచ్చిందట. కరోనాని జయించిన నేపథ్యంలో రాజమౌళి ప్లాస్మా డొనేషన్ కి సిద్ధంగా ఉన్నాడట. దానికోసం మరో మూడు వారాల పాటు వెయిట్ చేయాలని వైద్యులు సలహా ఇచ్చారట.