సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేకిచ్చి వెబ్ సీరీస్‌ల వెంట పడుతుంది. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రాకో.... లేదంటే సమంతానే వద్దనుకుందో కానీ.. ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంది. పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ని కొనసాగిస్తున్న సమంతని ఓ సీనియర్ హీరోయిన్ తెగ పొగిడేస్తోంది. ఆమె ఎవరో కాదు సమంత బాలీవుడ్‌లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్‌లో నటించింది. ఈ వెబ్ సీరీస్ పార్ట్ వన్‌లో కీలక పాత్రలో నటించిన ప్రియమణి... సమంత పెళ్ళి తర్వాత కూడా కెరీర్‌లో దూసుకుపోతుంది.. అది అందరికి సాధ్యం కాదని చెప్పుకొచ్చింది.
సమంతకి తనకి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్‌లో కాంబో సీన్స్ లేవని.. కానీ సమంత కేరెక్టర్ హైలెట్ అని గతంలోనే చెప్పిన ప్రియమణి తాజాగా.. పెళ్లి తర్వాత కూడా సమంతకి చాలా డిమాండ్ ఉందని.. సమంత తన ప్రతిభతో చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది. ఒకప్పుడు హీరోయిన్స్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసినా, లేదంటే నిశ్చితార్థం అయ్యింది అని తెలిసినా అవకాశాలు వచ్చేవి కావని, కానీ ప్రస్తుతం సినిమా పరిశ్రమ మరోలా ఆలోచిస్తుంది అని... అందుకు సమంతనే ఓ మంచి ఉదాహరణ అని చెబుతుంది ప్రియమణి. పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని.. అలాగే సమంత తన ఫిట్‌నెస్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా బాగున్నాయని అంటుంది. తనకి కూడా పెళ్లి తర్వాత చెప్పుకోదగిన అవకాశాలు వస్తున్నాయని గుర్తు చేసింది ప్రియమణి.