నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమా పై అనేక రకాల వార్తలు వచ్చాయి. కరోనా లేకపోయుంటే మార్చి 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యుండేది. కానీ కరోనా వచ్చి థియేటర్లని మూసి వేయడంతో రిలీజ్ ఆగిపోయింది. అయితే అప్పటి నుండి ఈ సినిమా ఓటీటీలో వచ్చేస్తుందని, 30కోట్లకి అమ్ముడైపోయిందని వినిపించినప్పటికీ ఆ వార్తలు నిజం కాలేదు. థ్రిల్లర్ సినుమా అయిన వి చిత్రాన్ని థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని చిత్ర వర్గాలు థియేటర్లల ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చాయి.
కానీ కరోనా ఉధృతి వేగంగా పెరుగుతున్న ప్రస్తుత సమయంలో థియేటర్లు ఇప్పుడప్పుడే తెరుచుకునేలా కనిపించడం లేదు. సో ఎక్కువ రోజులు వెయిట్ చేయడం అనవసరమని భావించిన చిత్ర బృందం ఓటీటీలో రిలీజ్ కి పచ్చజెండా ఊపిందని సమాచారం. ఓటీటీలో మేజర్ ఫీల్డ్ ఆక్రమించిన అమెజాన్ ప్రైమ్, వి సినిమాని 33కోట్లకి కొనుగోలు చేసిందట. సెప్టెంబరు 5వ తేదీ నుండి వి సినిమా అమెజాన్ లో అందుబాటులో ఉండనుందని తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుందట.
దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నానితో పాటు సుధీర్ బాబు మరో హీరోగా చేస్తున్నారు. అదితీ రావ్ హైదరీ, నివేథా థామస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు.