ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదు. పాన్ ఇండియా స్టార్ గా టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటింది. బాహుబలి హిట్ తో పెంచుకున్న క్రేజ్ తోనే సాహో ప్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. కాబట్టే వరసగా పాన్ ఇండియా మూవీస్ తోనే ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణతో రాధేశ్యామ్ చేస్తున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ తో తన తదుపరి మూవీని భారీ బడ్జెట్ తో నేషనల్ వైడ్ గా మొదలు పెడుతున్నాడు. ఈ సినిమా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా తెరకెక్కబోతుంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ నాగ్ అశ్విన్ - అశ్వినీదత్ మూవీకి ప్రభాస్ తీసుకోబోయే పారితోషకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది.
ఇప్పటివరకు సౌత్ లోనే కాదు ఇండియాలోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రజినీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఒక్క సినిమాకు దాదాపు 70 నుంచి 80 కోట్ల మధ్యలో పారితోషకం తీసుకుంటాడనే ప్రచారం ఉంది. రజినీకాంత్ కి ఎన్ని ప్లాప్స్ ఉన్నప్పటికీ ఆయనకుండే క్రేజ్ కి నిర్మాతలు దాసోహమే. అందుకే అడిగింది కాదనకుండా ఇచ్చేస్తారు. అయితే ఇప్పుడు రజినీకాంత్ రికార్డుని ప్రభాస్ కొల్లగొట్టబోతున్నాడు. నాగ్ అశ్విన్ తో చెయ్యబోయే సినిమాకి ప్రభాస్ ఏకంగా 100 కోట్లు అందుకోబోతున్నాడనే టాక్ వినబడుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ కి వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నాడని వార్తలైతే హాట్ టాపిక్ గా మారాయి. అదే నిజమైతే ఇండియా నెంబర్ వన్ గా ప్రభాస్ ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.