స్టార్ హీరోల మధ్యన ఫ్యాన్స్ వార్ ఏ రేంజ్ లో ఉంటుందో సోషల్ మీడియాలో తరుచు చూస్తూనే ఉంటాము. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ యుద్ధం చేస్తారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడిపిస్తున్నారు హీరోల ఫ్యాన్స్. అది స్టార్ హీరోల బర్త్ డే డీపీ హాష్ టాగ్ తో ఫ్యాన్స్ ట్వీట్స్ వేస్తూ హీరోల రేంజ్ చూపిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజు సందర్భంగా 24 గంటల వ్యవధిలో ఏకంగా 60 మిలియన్ ట్వీట్లు వేసిన చరిత్ర సృష్టించారు మహేష్ ఫ్యాన్స్. ఇది వరల్డ్ రికార్డ్ అని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు అంటూ మహేష్ ఫ్యాన్స్ పిచ్చ ఖుషీగా ఉన్నారు.
మరి మహేష్ ఫ్యాన్స్ దెబ్బకి ఇప్పుడు మిగతా హీరోల ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయ్యింది. మామూలుగా టాలీవుడ్ మెగా హీరోలకుండే ఫ్యాన్స్ ముందు మిగతా హీరోల ఫ్యాన్స్ జుజుబినే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు ఎవరు ఓ లెక్కలోకి రారు. కానీ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో రేంజ్ సోషల్ మీడియాలో చూసారా అంటున్నారు. మెగా హీరోల్లో చిరు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం కలిసి సోషల్ మీడియాని షేక్ చెయ్యగల సత్తా ఉన్నవారు. మరి ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ చేసిన వరల్డ్ రికార్డు మెగా ఫ్యాన్స్ ముందున్న కొత్త టార్గెట్. త్వరలోనే రాబోతున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు మహేష్ ఫ్యాన్స్ వేసిన 60 మిలియన్లు ట్వీట్స్ రికార్డుని కొట్టడమే కాదు.. కొత్త శిఖరాల్ని అందుకొని.. సరికొత్త రికార్డుని సృష్టించాలని పవన్ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు.