Advertisementt

రానా పెళ్ళిపై అమూల్ కార్టూన్ చూసారా..

Tue 11th Aug 2020 09:38 PM
rana daggubati,amul co op,miheeka bajaj,daggubati family  రానా పెళ్ళిపై అమూల్ కార్టూన్ చూసారా..
Amul cartoon on Ranas Wedding.. రానా పెళ్ళిపై అమూల్ కార్టూన్ చూసారా..
Advertisement
Ads by CJ

కరోనా లాక్ డౌన్ మొదలయినప్పటి నుండి టాలీవుడ్ హీరోలందరూ ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలెక్కేస్తున్నారు. నిఖిల్, నితిన్, రానా.. వరుసగా పెళ్ళి చేసుకుని ఓ ఇంటివారయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా రానా వివాహమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భళ్ళాల దేవుడు రానా వివాహం వెడ్డింగ్ ప్లానర్ మిహీకా బజాజ్ తో జరిగిన వేళ ఇండస్ట్రీ పెద్దల నుండే కాకుండా కార్పోరేట్ కంపెనీల నుండి కూడా అభినందనలు వచ్చాయి. 

దేశంలో పాల ఉత్పత్తిలో దూసుకుపోతున్న అమూల్ బ్రాండ్ రానా పెళ్ళిపై కార్టూన్ ని విడుదల చేసింది. దగ్గుబట్టర్లీ వెడ్డింగ్ పేరుతో విడుదల చేసిన ఈ కార్టూన్ చాలా ఆసక్తికరంగా ఉంది. రానా.. యే ఖానా అంటూ క్యాప్షన్ ని ఇస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా రూపొందించింది. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రానాకి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ విధంగా తనపై గౌరవాన్ని చూపుతూ కార్టూన్ విడుదల చేసిన అమూల్ సంస్థకి రానా దన్యవాదాలు తెలిపాడు. 

Amul cartoon on Ranas Wedding..:

Amul cartoon on Ranas Wedding..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ