గత కొన్ని రోజులుగా నితిన్ హీరోగా నటించబోతున్న అంధాధున్ తెలుగు రీమేక్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఘనవిజయం అందుకున్న అంధాధున్ చిత్ర తెలుగు రీమేక్ హక్కులని కొని పెట్టుకున్న నితిన్, క్యాస్టింగ్ ఎంపిక చేసే పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అంధాధున్ సినిమా క్యాస్టింగ్ ఎంపిక చాలా రోజుల నుండి జరుగుతూనే ఉంది.
ముఖ్యంగా ఈ సినిమాలో ఒకానొక కీలక పాత్రకోసం చాలా మంది హీరోయిన్లని సంప్రదించారు. అంధాధున్ లో టబు పోషించిన పాత్రలో చేయడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఇప్పటికే రమ్యక్రిష్ణ, శిల్పాశెట్టి, ఇలియానా, యాంకర్ అనసూయ మొదలగు వారిని సంప్రదించారు. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతారని కూడా అడిగారట. దక్షిణాదిన టాప్ లో ఉన్న నయనతార ఈ సినిమాలో నటించడానికి 9కోట్లు అడిగిందన్న ప్రచారం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం నయనతార అంధాధున్ తెలుగు రీమేక్ ని రిజెక్ట్ చేసిందని అంటున్నారు. టబు పోషించిన పాత్ర కొంత బోల్డ్ గా ఉండడం, ఇతర పాత్రలని చంపేసే విధంగా ఉండడం వల్ల నయనతార అందులో నటించేందుకు నిరాకరించిందట. మరి ఇంతమంది రిజెక్ట్ చేసిన పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.