దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి గత శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా ఎఫెక్ట్ వలన చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నా.. ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉన్నాయి. దగ్గుబాటి రానా పెళ్లి అంటే ఇండస్ట్రీలో ఓ రేంజ్ ఉండాలి. కానీ కరోనా ఆ రేంజ్ ని పక్కనబెట్టి సింపుల్ గా పెళ్లి చేసుకునేలా చేసింది. రానా - మిహీకా బజాజ్ వివాహం కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్యన జరిగింది. రానా పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పెళ్ళికి రానా ఫ్రెండ్ రామ్ చరణ్ సతీ సమేతంగా హాజరవగా.. అక్కినేని కోడలు సమంత - నాగ చైతన్య ఈ పెళ్ళికి హాజరయ్యారు. చైతు - సమంతలు పెళ్లి వేడుకలైన సంగీత్, మెహిందీ అన్ని ఫంక్షన్స్‌కి హాజరయ్యారు.
అయితే ఈ పెళ్ళిలో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అయిన నాగార్జున కానీ అమల కానీ అఖిల్ కానీ కనిపించలేదు. దగ్గుబాటి రామానాయుడి కూతురు లక్ష్మిని నాగార్జున మొదటి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అమలాని రెండో పెళ్లి చేసుకున్న నాగార్జునకి దగ్గుబాటి ఫ్యామిలీతో సత్సంబంధాలే ఉన్నాయి. కానీ రానా పెళ్ళిలో నాగ్ మిస్సింగ్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. కరోనా భయంతో నాగార్జున రాలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే నాగార్జున కరోనాని లెక్క చెయ్యకుండా బిగ్ బాస్ సీజన్ 4 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పిలవలేదు అనుకోవడానికి లేదు. ఆ ఫ్యామిలిలో చైతు ఉన్నాడు. ఫ్రెండ్ రామ్ చరణ్‌ని పిలిచి నాగ్‌ని వదలరు. కానీ నాగ్ అక్కడ కనిపించలేదు.
ఇక చిరు ఫ్యామిలీ నుండి చరణ్ దంపతులు వస్తే.. నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరూ హాజరవలేదు. అలాగే మోహన్ బాబు ఫ్యామిలీ నుండి కూడా హాజరవలేదు. అయితే కరోనా కారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పిలవలేదు అనుకోవచ్చు. కానీ నాగార్జున రాకపోవడమే ఇప్పుడు హైలెట్ అయ్యింది. మరి పెళ్లి ఎంత బాగా జరిగినా ఇండస్ట్రీలోని ముఖ్యమైన అతిథులు అంటే ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలు లేని లోటు మాత్రం స్పష్టంగా కనబడుతుంది.