చేతిలో సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో రకుల్ ప్రీత్ కన్నా ముందెవరు ఉండరు. జిమ్ డ్రెస్ అయినా, ఎయిర్‌పోర్ట్ అయినా ఎందులోనైనా రకుల్ హాట్ అందాల ముందు అందరూ దిగదుడుపే. లాక్‌డౌన్‌లోను సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్‌తో హంగామా చేస్తున్న రకుల్‌ని స్టార్ హీరోలు లైట్ తీసుకున్నారు. మరోవైపు యంగ్ హీరోలు రకుల్‌ని పట్టించుకోవడం లేదు. అలాంటి టైంలోనే టాలీవుడ్‌లోను, బాలీవుడ్‌లోను సీనియర్ హీరోలకి గాలం వేస్తుంది. ఇప్పటికే తెలుగులో నాగార్జున మన్మథుడు 2 లో నటించిన రకుల్.. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ తోనూ నటించింది.
తాజాగా రకుల్ టాలీవుడ్ సీనియర్ హీరోలకి ఓకే చెప్పబోతోంది అనే టాక్ నడుస్తుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో నటించిన రకుల్ ప్రీత్‌కు ఇప్పుడు వీరి సరసన నటించే అవకాశాలు రావడం లేదు. అందుకే సీనియర్స్‌కి కమిట్ అవుదామని రకుల్ డెసిషన్ తీసుకుందట. అందులో భాగంగా చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్స్ కి తాను మీ సినిమాల్లో నటించడానికి సిద్ధమనే సంకేతాలు పంపుతుందట. ఇప్పటికే సీనియర్ హీరోల నుండి రకుల్‌కి ఆఫర్స్ వెళుతున్నాయని.. రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. వారి సరసన నటించేందుకు రెడీగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.