Advertisementt

సమంత, రష్మిక కలిసి.. సాధ్యమేనా?

Mon 10th Aug 2020 11:32 PM
samantha,rashmika mandanna,sister roles,heroines  సమంత, రష్మిక కలిసి.. సాధ్యమేనా?
Samantha, Rashmika Mandanna In one Movie సమంత, రష్మిక కలిసి.. సాధ్యమేనా?
Advertisement
Ads by CJ

పెళ్లి తర్వాత సమంత మనసుకు నచ్చిన సినిమాలు చేస్తుంది. ఈ ఏడాది కేవలం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తప్ప మరో సినిమా ఒప్పుకోని సమంత తమిళనాట విజయ్ సేతుపతి సినిమా నుండి కూడా బయటికి వచ్చేసినట్టుగా టాక్ ఉంది. చాలామంది దర్శకనిర్మాతలు అటు సినిమాల కోసం, ఇటు వెబ్ సీరీస్‌ల కోసం సమంత వెంటపడుతుంటే సమంత మాత్రం ఎవ్వరికీ ఎస్ చెప్పడం లేదు. అలాంటి టైంలో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ రష్మికతో కలిసి సమంత స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అనే న్యూస్ నడుస్తుంది.

తెలుగులో తారాజువ్వలా దూసుకొచ్చి.. స్టార్ హీరోల సినిమాల అవకాశాలు పట్టేస్తున్న రష్మిక - పెళ్లి తర్వాత గ్లామర్ పరంగా దూసుకుపోతున్న సమంత కలిసి అక్కాచెల్లెళ్లుగా ఓ సినిమాలో నటించబోతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ యువ దర్శకుడు అక్కాచెల్లెళ్ల కథతో సమంత, రష్మికలను సంప్రదించాడనీ... కథ నచ్చిన రష్మిక - సమంత ఇద్దరూ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా హీరోయిన్స్ ఓరియంటెడ్‌గా ఉండబోతుంది అని అందుకే సమంత కూడా ఒప్పుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే ప్రస్తుతం సినిమాలు ఒప్పుకోని సమంత - స్టార్ హీరోల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్న రష్మిక కలిసి నటిస్తే ఆ సినిమాకి వచ్చే క్రేజే వేరు. కానీ అది సాధ్యమేనా అంటున్నారు.

Samantha, Rashmika Mandanna In one Movie:

Samantha, Rashmika Mandanna to play sister roles?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ