Advertisementt

నా జీవితంలోని అనుభవాలే ఆ సినిమా..

Mon 10th Aug 2020 09:26 PM
colourphoto,suhas,sunil,sai rajesh,chandini chowdary,viva harsha  నా జీవితంలోని అనుభవాలే ఆ సినిమా..
Interesting news about Colourphoto.. నా జీవితంలోని అనుభవాలే ఆ సినిమా..
Advertisement
Ads by CJ

ఈ మధ్య రిలీజైన కలర్ ఫోటో టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ సుహాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా కనిపిస్తుంది. లఘుచిత్రాల ద్వారా పరిచయమైన సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

అంతేకాదు కలర్ ఫోటో చిత్రానికి కథ అందించింది కూడా సాయి రాజేషే. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ టీజర్ ని చూస్తుంటే నల్లగా ఉన్నాడని  వివక్షకి గురయ్యే హీరో పాత్ర తెల్లని రంగుగల అమ్మాయిని ప్రేమిస్తే ఎదురయ్యే పరిస్థితులు ఏంటన్నది చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ వివక్ష వెనక మరో కోణం ఉందని అర్థం అవుతుంది. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. 

అయితే ఈ సినిమాలోని కొన్ని అంశాలు సాయి రాజేష్ జీవితంలో నిజంగా జరిగాయట. తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాల ఆధారంగా రాసుకున్నాడట. కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ సినిమాతో సీరియస్ విలన్ గా కనిపించబోతున్నాడు. సుహాస్, చాందినీ చౌదరితో పాటు వైవా హర్ష పాత్ర కీలకంగా ఉండనున్న ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Interesting news about Colourphoto..:

Interesting news about Colourphoto..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ