Advertisementt

అల్లు అర్జున్ సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్న బాలీవుడ్..?

Mon 10th Aug 2020 07:00 AM
allu arjun,tiger shroff,parugu,hero panti,kriti sanon,sheela,bommarillu bhaskar  అల్లు అర్జున్ సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్న బాలీవుడ్..?
Sequel for Allu Arjun Movie..? అల్లు అర్జున్ సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్న బాలీవుడ్..?
Advertisement
Ads by CJ

ప్రేమకథా చిత్రాల దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పరుగు సినిమా ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. షీలా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తండ్రిగా ప్రకాష్ రాజ్ పాత్రని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. పరుగు సినిమాని హిందీలో హీరో పంటి పేరుతో రీమేక్ చేసారు. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ఈ రీమేక్ లో హీరోగా నటించాడు. హీరో పంటి బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాన్ని తెచ్చుకుంది.

క్రితి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అతి త్వరలో సీక్వెల్ రాబోతుందట. ఈ మేరకు కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. చిత్రబృందం ఇప్పటికే స్క్రిప్టు పనుల్లో ఉన్నారని అంటున్నారు.టైగర్ ష్రాఫ్ కూడా సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. దాంతో అతి తొందరలో ఈ సీక్వెల్ విషయమై అధికారిక ప్రకటన బయటకి వెల్లడి చేస్తారట. అయితే ఈ సీక్వెల్ లో బన్నీ అతిథి పాత్రలో కనిపిస్తాడట.

ఈ విషయమై చిత్ర నిర్మాతలు బన్నీ సంప్రదించాలని అనుకుంటున్నారట. పుష్ప ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ ని టార్గెట్ చేసిన బన్నీ బాలీవుడ్ సినిమాలో, అదీ తన సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సినిమాలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్ప తర్వాత బన్నీ నుండి వచ్చేవన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు సినిమాలు కాబట్టి ఈ  సీక్వెల్ లో కనిపిస్తే మంచి ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Sequel for Allu Arjun Movie..?:

Sequel for Allu Arjun Movie..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ