Advertisementt

సర్కారు వారి పాట.. మోషన్ పోస్టర్ విడుదల.

Sun 09th Aug 2020 09:36 AM
sarkaru vaari paata,mahesh babu,mythri movie makers,keerthy suresh  సర్కారు వారి పాట.. మోషన్ పోస్టర్ విడుదల.
Sarkaru Vaari Paata motion poster release సర్కారు వారి పాట.. మోషన్ పోస్టర్ విడుదల.
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాట పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ కి మంచి స్పందన లభించింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బ్యాంకు మోసాల నేపథ్యంలో ఉండనుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

మహేష్ బాబు పుట్టినరోజుని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ప్రీ లుక్ లో అందరికీ ఆసక్తి కలిగించిన రూపాయి నాణెం టాటూని ఎగరవేస్తూ మహేష్ కనిపించాడు. ప్రీ లుక్ మాదిరిగానే ఈ మోషన్ పోస్టర్ లోనూ మహేష్ బాబుని కనిపించకుండా చేసారు. థమన్ అందించిన సంగీతం మాస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. పరశురామ్ చెప్పినట్టు ఈ సినిమా పూర్తిగా మాస్ సినిమాగా ఉండనుందని తెలుస్తుంది.

మొత్తానికి మహేష్ పుట్టినరోజున అభిమానులకి సరైన సర్పైజ్ లభించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

click here for motion poster

Sarkaru Vaari Paata motion poster release:

Sarkaru Vaari Paata motion poster release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ