పూరి జగన్నాథ్ తన ఆలోచనలని పోడ్ కాస్ట్ రూపంలో అందిస్తున్నారు. దాంట్లోంచి ఒకానొక ఆసక్తికరమైన అంశం డబ్బు..
డబ్బు మనిషికి అవసరం.. ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ.. సంపాదించుకోవడానికి కూడా డబ్బు కావాలి. డబ్బు లేకుండా ప్రపంచం నడవదు. డబ్బున్నవాడినే పక్కవాడు పలకరిస్తాడు. మతాలన్నీ డబ్బు ముఖ్యం కాదు ఆత్మ, పరమాత్మ ముఖ్యమని ఏవేవో కబుర్లు చెబుతుంటాయి. అవన్నీ నమ్మకండి. డబ్బుంటేనే దేవుడికి గుడి వస్తుంది. డబ్బున్న వాళ్ళు హుండీలో కానుకలేస్తేనే గుడి రన్ అవుతుంది.
అంతెందుకు కేరళలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం గురించి ఇంతకు ముందు ఎంత మందికి తెలుసు.. గుడిలో ఉన్న లంకెబిందెలన్నీ బయటపడ్డాకే అనంత పద్మనాభస్వామి అందరికీ పరిచయం అయ్యాడు. ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు. డబ్బుని చులకనగా చూడొద్దు. డబ్బుని రెస్పెక్ట్ చేయండి.. డబ్బులేని వారికి రెస్పెక్ట్ ఇవ్వరు. అదే డబ్బున్న ధనవంతుడు కనబడితే రెస్పెక్ట్ ఏ రేంజిలో ఉంటుంది అందరికీ తెలుసు..
కొంతమంది మేధావులు డబ్బుని పట్టించుకోరు. ఏముందిలే ఒక్క తన్ను తన్నితే అదే వస్తుంది అంటారు. దమ్ముంటే ఒక కోటి రూపాయలు సంపాదించి అలా రోడ్డు మీద విసిరేయండి..
అందుకే మేదావుల దగ్గర కన్నా సామాన్యుల వద్దే ఎక్కువ డబ్బు ఉంటుంది. డబ్బు మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. పుస్తకాలు చదువుతూ జీవితం గడిపేస్తా.. అని నువ్వనచ్చు.. దానిక్కూడా డబ్బు కావాలి. చివరగా పూరి చెప్పినదేంటంటే జీవితంలో కావల్సినంత సంపాదించు.. సంతోషంగా జీవించడానికి, అవసరాలు తీరడానికి, అనుకున్నది సాధించడానికి కావాల్సినంత డబ్బు సంపాదించు..