Advertisementt

ఆ బ్యానర్ లో కొరటాల శివ సినిమా ఉంటుంది.. కానీ..

Sat 08th Aug 2020 08:44 AM
koratala shiva,chiranjeevi,mythri movie makers,  ఆ బ్యానర్ లో కొరటాల శివ సినిమా ఉంటుంది.. కానీ..
Koratala Shiva Movie with that banner is.. ఆ బ్యానర్ లో కొరటాల శివ సినిమా ఉంటుంది.. కానీ..
Advertisement
Ads by CJ

సామాజిక కథాంశాన్ని కమర్షియల్ అంశాలతో మిక్స్ చేస్తూ ప్రేక్షకుడికి ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సందేశం ఇచ్చే దర్శకుడు కొరటాల శివ, ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించాడు. అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రకటన ఆల్రెడీ వచ్చేసింది. ఈ సినిమా యువసుధ బ్యానర్ లో మిక్కినేని సుధాకర్ నిర్మాతగా తెరకెక్కుతోంది.

అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. నిజానికి కొరటాల నెక్స్ట్ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ లో ఉంటుందని అనుకున్నారు. ఈ విషయమై మైత్రీ మూవీస్ కొరటాల నుండి కమిట్మెంట్ తీసుకుందట. కానీ సడెన్ గా కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో సినిమా ప్రకటించేసరికి మైత్రీ వారు షాక్ అయ్యారట.  తాజా సమాచారం ప్రకారం కొరటాల శివతో మైత్రీ సినిమా ఉంటుందట. 

కొరటాల చేతిలో ఉన్న ఆచార్య, బన్నీ తో చేస్తున్న చిత్రం పూర్తయ్యాక మైత్రీ మూవీస్ బ్యానర్ లో కొరటాల సినిమా చేస్తాడట. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్.. వంటి సూపర్ హిట్లని అందించిన కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందన్నమాట. చూడాలి మరి భవిష్యత్తులో ఏమవుతుందో..!

Koratala Shiva Movie with that banner is..:

Koratala Shiva Movie with that banner is..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ