Advertisementt

బిగ్ బాస్ 4.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..

Sat 08th Aug 2020 07:44 AM
bigg boss 4,nagarjuna,hamsa nandini,noel,magli,raghu master  బిగ్ బాస్ 4.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..
Bigg Boss will Start from బిగ్ బాస్ 4.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..
Advertisement
Ads by CJ

తెలుగు టెలివిజన్ పై తిరుగులేని టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగవ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మూడేళ్ళుగా వంద రోజుల పాటు వినోదం అందిస్తున్న ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆశగా ఉన్నారు. థియేటర్లు తెరుచుకోక వినోదమంతా టీవీ, ఓటీటీలకే పరిమితమైన నేపథ్యంలో బిగ్ బాస్ షో పంచే వినోదంపై ఆసక్తిగా ఉన్నారు.

నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుందని స్టార్ మా బృందం టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున బిగ్ బాస్ ప్రోమో షూటింగ్స్ లో పాల్గొన్నాడు కూడా. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఆగస్టు 30వ తేదీ నుండి మొదలు కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్టార్ మా అధికారికంగా ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ఈ షోకి వచ్చే కంటెస్టెంట్ల విషయమై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. హంసా నందినీ, యామినీ భాస్కర్, సింగర్ నోయల్, ఫోక్ సింగర్ మంగ్లీ, డాన్స్ మాస్టర్ రఘు.. హౌస్ లోకి వస్తున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్లు క్వారంటైన్ లో ఉన్నారట.  

Bigg Boss will Start from:

Bigg Boss will Start from

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ