Advertisementt

మొత్తానికి మోక్షజ్ఞని రెడీ చేస్తున్నాడు

Sat 08th Aug 2020 11:15 PM
balayya,arranged,special trailers,mokshagna,mokshagna entry  మొత్తానికి మోక్షజ్ఞని రెడీ చేస్తున్నాడు
Mokshagna Serious Attempts to Make His Debut మొత్తానికి మోక్షజ్ఞని రెడీ చేస్తున్నాడు
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఇండస్ట్రీపై కరోనా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసి మొన్నామధ్యన బాగా హైలెట్ అయ్యాడు. చిరు అండ్ గ్యాంగ్ మీద ఇండైరెక్ట్ గా మాట్లాడి హీరో అయ్యాడు. ప్రభుత్వ అనుమతులు ఇచ్చినా.. గతంలోలా సినిమా ఇండస్ట్రీ ఉండదని, షూటింగ్స్ జరగడం అంత ఈజీ కాదంటూ మాట్లాడాడు. అయితే బాలకృష్ణ కరోనా లాక్ డౌన్ సమయంలో అప్పుడప్పుడు బసవతారకం హాస్పిటల్‌ని విజిట్ చేస్తున్నాడు కానీ.. మరెక్కడా బయట కనిపించడం లేదు. అయితే లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉంటున్న బాలయ్య తన కెరీర్ సంగతి ఎలా ఉన్నా.. ముందు తన కొడుకు మోక్షజ్ఞని హీరోగా ఎంట్రీ ఇప్పించే ప్లాన్ చేసాడట.

లాక్‌డౌన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీకి సరిపోయే కథలను ఫోన్ లో వింటున్నాడట. బాలయ్య గత రెండున్నరేళ్లుగా మోక్షజ్ఞని వెండితెరకి పంపించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ మోక్షజ్ఞ మాత్రం హీరో అవడానికి సిద్ధంగా లేడనేది ఆయన మెయింటైన్ చేస్తున్న ఫిట్నెస్ చూస్తే తెలుస్తుంది. పెద్దగా ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టినట్లుగా లేడు. అందుకే పెద్ద పొట్ట, బరువుతో హీరోకి ఉండాల్సిన లక్షణాలు కనిపించకుండా కనిపించాడు. 

కానీ బాలయ్య ఈ లాక్ డౌన్ సమయంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ విషయంలో కాస్త సీరియస్‌గా ఉన్నాడట. అందుకే ఫిట్ నెస్‌, న‌ట‌న‌కు సంబంధించిన మెళ‌కువ‌లు.. దానిలో శిక్షణ కోసం కొంత‌మంది నిపుణుల్ని కూడా బాలయ్య.. కొడుకు మోక్షజ్ఞ కోసం నియమించినట్టుగా టాక్. ఇప్పటికే యంగ్ దర్శకులు చెప్పిన కథలను ఫోన్ లో విని ఓకే చేస్తున్నాడట బాలయ్య. మరి 2021లో మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అంటున్నారు నందమూరి అభిమానులు. 

Mokshagna Serious Attempts to Make His Debut:

Balayya arranged special trailers for Mokshagna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ