చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. కరోనాతో ఆచార్య షూటింగ్ ఆగడంతో.. ప్రస్తుతం చిరంజీవి ప్లాప్ దర్శకులు తెచ్చిన కథలు వింటున్నాడు. కథ నచ్చితే యంగ్ అండ్ ప్లాప్ దర్శకులతో అయినా పనిచేస్తా అని చిరు చెప్పడంతో చిరుని హీరోగా పెట్టుకుని దర్శకుడు బాబీ, మెహెర్ రమేష్ లాంటి వాళ్ళు కథలు రాశారు. అయితే చిరు మలయాళ లూసిఫర్ రీమేక్ ని పక్కనబెట్టి.. దర్శకుడు బాబీ చెప్పిన కథకి ఇంప్రెస్స్ అవడమే కాదు... ఆ సినిమాని ఆచార్య తర్వాత చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. లూసిఫర్ వదిలేసిన చిరు బాబీతో సినిమానా అన్నారు మెగా ఫ్యాన్స్.
అయితే అదంతా ఒక ఎత్తైతే ఇప్పడు చిరంజీవి మెహెర్ రమేష్ తో సినిమా చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. శక్తి, షాడో సినిమాల అట్టర్ ప్లాప్స్ తర్వాత మెహెర్ రమేష్ కొన్ని ఏళ్లుగా సినిమాల దర్శకత్వానికి బ్రేకిచ్చేశాడు. అలాంటిది మెహెర్ రమేష్‌తో చిరు సినిమా అంటూ మెగా ఫ్యాన్స్‌లో కంగారు పుడుతుంది. అయితే మెహెర్ రమేష్ రీమేక్స్ ని పర్ఫెక్ట్ గా చేస్తాడని నమ్మి చిరు రమేష్‌ని పిలిచి తమిళ వేదాళంని రీమేక్ చెయ్యమని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.
అజిత్ నటించిన వేదాళం మూవీ అక్కడ సూపర్ హిట్. అదే సినిమాని తెలుగులో చిరు మెహెర్ రమేష్ దర్శకత్వంలో రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నాడట. ఈ సినిమాని కె ఎస్ రామారావు కానీ, లేదంటే కొణిదెల ప్రొడక్షన్ లోనే రీమేక్ చేస్తారని వినికిడి. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం మెహెర్ తో సినిమా ఏంటన్నయ్యా... మీరు కూడా ఇలా చేస్తే ఎలా అంటూ తెగ ఫీలవుతున్నారట.