తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయమే ఎరుగని డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు కాగా కొరటాల మరొకరు. అదే క్యాటగిరీలోకి అనిల్ రావిపూడి కూడా వస్తాడు. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారి సినిమా సినిమాకి హిట్టు రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. కరోనా కారణంగా ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగింది. అందువల్ల చాలా మంది డైరెక్టర్లు వెబ్ సిరీస్ లని తెరకెక్కించే పనిలో పడ్డారు. అయితే అల్లు అరవింద్ అనిల్ రావిపూడిని వెబ్ సిరీస్ కోసం సంప్రదించారట. ఆహా కోసం కామెడీ వెబ్ సిరీస్ రూపొందించాలని ఐదుకోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేసాడట. ఆ ఆఫర్ ని అనిల్ రావిపూడి తిరస్కరించాడని టాక్.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఈ సమయంలో వెబ్ సిరీస్ లు చేయడమే సరైన పని అని అందరూ భావిస్తున్నారు. మరి అనిల్ రావిపూడి ఏ విధంగా ఆలోచిస్తున్నారో..!