సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తో వస్తున్నాడు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రీ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది కూడా. ప్రీ లుక్ రిలీజై రెండూ నెలలవుతున్నా కూడా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. కరోనా ఉధృతి పెరుగుతున్న ప్రస్తుత సమయంలో చిత్రీకరణకి వెళ్ళడం సమంజసం కాదని ఊరుకున్నారు.
అయితే ఇంకా చిత్రీకరణ మొదలు కాని ఈ సినిమా నుండి మహేష్ బాబు పుట్టినరోజున ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ అప్డేట్ గురించి పక్కన పెడితే తాజాగా మహేష్ బాబు అభిమానులకి తన విన్నపాన్ని తెలియజేసాడు. అభిమానులని ఉద్దేశించి మాట్లాడిన మహేష్, తన పుట్టినరోజుని ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని అభిమానులు చేస్తున్న పనులకు సంతోషంగా ఉందని, అందుకు అభిమానులని అభినందిస్తూ.. కరోనా సమయంలో అందరి ఆరోగ్యం సురక్షితంగా ఉండడమే అన్నింటికన్నా ముఖ్యమని చెప్పాడు.
అందువల్ల పుట్టినరోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా మహేష్ తెలియజేసాడు.