నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు తేజ, ఆ తర్వాత చేసిన సీత సినిమాతో ట్రాక్ తప్పాడు. ప్రస్తుతం రెండు సినిమాలని ప్లాన్ చేసిన తేజ, గోపీచంద్ తో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. అలివేలు మంగ వెంకటరమణ పేరుతో తెరకెక్కే ఈ చిత్రం కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడు. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల వెబ్ సిరీస్ ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు.
ప్రస్తుతం కరోనా బారిన పడ్డ తేజ మెల్ల మెల్లగా రికవరీ అవుతున్నాడు. కరోనాని పూర్తిగా జయించిన తర్వాత వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నాడట. నిజానికి ఈ వెబ్ సిరీస్ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయట. ఇప్పటికే ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేసారని చెప్పుకుంటున్నారు. ష్టోరీస్ పేరుతో రూపొందే ఈ వెబ్ సిరీస్ ఇప్పటి జెనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందట. లవ్, బ్రేకప్ లని డీల్ చేస్తూ ఈ సిరీస్ తెరకెక్కుతోందట.
రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ ఫేమ్ దాక్షి గుత్తి కొండ ఈ సిరీస్ లో ఫీమేల్ లీడ్ గా కనిపించనుందట. కరోనా నుండి రికవరీ అయ్యాక తేజ ఈ సిరీస్ పనుల్ని వేగవంతం చేస్తాడని సమాచారం. థియేటర్లు మూతబడిన కారణంగా కుప్పలు తెప్పలుగా వస్తున్న వెబ్ సిరీస్ లలో తేజ ష్టోరీస్ ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.