Advertisementt

నితిన్ రిస్క్ చేస్తున్నాడేమో..?

Fri 07th Aug 2020 07:45 AM
nithin,nayanathara,merlapaka gandhi,andhadhun  నితిన్ రిస్క్ చేస్తున్నాడేమో..?
Is NIthin taking risk..? నితిన్ రిస్క్ చేస్తున్నాడేమో..?
Advertisement
Ads by CJ

భీష్మ సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్, తన తర్వాతి చిత్రంగా రంగ్ దే తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నితిన్ కి హిట్ తెచ్చేలా కనబడుతుంది. అయితే రంగ్ దే, పవర్ పేట, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా ఇంకా బాలీవుడ్ అంధాధున్ రీమేక్.. మొదలగు చిత్రాలని లైన్లో పెట్టిన నితిన్, అంధాధున్ చిత్రం కోసం నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాడు.

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన అంధాధున్ చిత్రంలో బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. హీరోగా ఆయుష్మాన్ ఖురానా పర్ ఫార్మెన్స్ జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తెలుగు రీమేక్ కి మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ని తీసుకోవడానికి చాలా రోజులుగా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. హిందీలో టబు ప్లే చేసిన ఆ పాత్రకి చాలా మందిని అడిగారు.

రమ్యక్రిష్ణ, శిల్పాశెట్టి, అనసూయ, ఇలియానా మొదలగు పేర్లు ఆ లిస్టులో  వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం దక్షిణాదిన టాప్ లో ఉన్న హీరోయిన్ నయనతారని సంప్రదించారట. హీరోకి సమాన ప్రాధాన్యం ఉన్న ఆ పాత్రలో చేయడానికి నయనతార 9కోట్లు అడిగిందని అంటున్నారు. రీమేక్ సినిమా.. అందునా చాలా మంది చూసేసిన సినిమా.. అలాంటి సినిమాకి అంతమొత్తంలో పారితోషికం ఇస్తే సినిమా బడ్జెట్ బాగా పెరిగి రిస్క్ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి నితిన్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఏమో..!

Is NIthin taking risk..?:

Is NIthin taking risk..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ