సుకుమార్ బన్నీతో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించబోయే పుష్ప సినిమాని పట్టాలెక్కించడానికి రెడీగా ఉన్నా కరోనా వాళ్ళని కదలనీయడం లేదు. అదిగో ఇదిగో అంటూ పుష్ప సినిమా చిత్ర బృందం అంతా లగేజ్ ప్యాక్ చేసుకుని ఉంది. అడవులకి వెళ్లి షూటింగ్ చెయ్యడానికి. కానీ కరోనా వారికీ సహకరించడం లేదు. ఇక కరోనా వ్యాక్సిన్ వచ్చాకే పుష్ప సినిమా కూడా సెట్స్ మీదకెళ్ళేది. ప్రస్తుతం పుష్ప రఫ్ లుక్ లోనే అల్లు అర్జున్ కంటిన్యూ అవుతున్నాడు కానీ.. న్యూ లుక్ లోకి రాలేదు. కరోనా భీభత్సం తగ్గగానే సెట్స్ మీదకెళ్లడానికి లుక్ మార్చకుండా అలానే ఉంటున్నాడు.
అయితే సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ మీద సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అడవిలో ఆణువణువు తెలిసి... పోలీసులను, స్మగ్లింగ్ మాఫియాని ముప్పతిప్పలు పెట్టేస్తాడట బన్నీ. దానిలో భాగంగానే భారీ ఛేజింగ్, రన్నింగ్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. ఇక సుకుమార్ కూడా స్మగ్లర్లు, పోలీసుల మధ్యలో వందలాదిమంది కూలీలు ఎలా బలవుతున్నారు, వారు పడే కష్టాలను కూడా పుష్ప మూవీలో ప్రస్తావిస్తాడని సమాచారం. గతంలో అనేక మంది నల్లమల, శేషాచలం అడవుల్లో చెట్లు నరికే కూలీలు పోలీసుల కాల్పుల్లో మరణించారు. మరి ఈ విషయాలను కూడా పుష్పలో సుకుమార్ చూపిస్తాడా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది.