Advertisementt

త్రివిక్రమ్ పారితోషకం అంత అంటే నమ్మెదెలా?

Fri 07th Aug 2020 11:32 PM
trivikram srinivas,remuneration,jr ntr,20 crore  త్రివిక్రమ్ పారితోషకం అంత అంటే నమ్మెదెలా?
Gossips on Trivikram remuneration for Jr NTR Project త్రివిక్రమ్ పారితోషకం అంత అంటే నమ్మెదెలా?
Advertisement
Ads by CJ

కరోనా టైంలో దర్శకులు, హీరోలు, హీరోయిన్స్ అంతా పారితోషకాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి వేల కోట్లు లాస్. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు రావాలి, షూటింగ్స్ ఎప్పుడు మొదలు కావాలి, విడుదల కావల్సిన సినిమాలు ఎప్పుడు విడుదల కావాలి. ఇలాంటి టైంలో పారితోషకం ఇంత అని ఫిక్స్ చెయ్యలేం. చేసినా నిర్మాతలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో త్రివిక్రమ్ పారితోషకంపై వస్తున్న వార్తలు అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో త్రివిక్రమ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీకి కమిట్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ కోసం త్రివిక్రమ్ 20 కోట్ల పారితోషకం అందుకోబోతున్నాడట.

భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకి హరిక హాసిని వారితో పాటుగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా కలిపి నిర్మిస్తుంది. ఈ సినిమాకి ఎన్టీఆర్ కోసం 40 కోట్లు ఫిక్స్ చేసారని.. అలాగే త్రివిక్రమ్ కి 20 కోట్ల పారితోషకం అంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే కరోనా తర్వాత మార్కెట్ లెక్కలు మారతాయని భావిస్తున్నారు. అప్పుడు మరి త్రివిక్రమ్ పారితోషికంపై కూడా కోత పడుతుందో లేదో తెలీదు. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ పారితోషకం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా హైలెట్ అవుతుంది. కరోనాతో బడ్జెట్ లు తగ్గించుకోవాలి, అలాగే పారితోషకాలకు కోత పడాలె అన్నది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. 

Gossips on Trivikram remuneration for Jr NTR Project :

20 Crore remuneration to Trivikram srinivas 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ