Advertisementt

సరిలేరు నీకెవ్వరు ఖాతాలో సరికొత్త రికార్డు

Thu 06th Aug 2020 05:25 PM
sarileru neekevvaru,mahesh babu,anil ravipudi,telugu  సరిలేరు నీకెవ్వరు  ఖాతాలో సరికొత్త రికార్డు
Mahesh Babu created a new record సరిలేరు నీకెవ్వరు ఖాతాలో సరికొత్త రికార్డు
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీసుని షేక్ చేసింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటి వరకూ అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత విజయశాంతి తెర మీద కనిపించిన ఈ చిత్రం ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే వెండితెర మీద సంచలనం సృష్టించిన సరిలేరు నీకెవ్వరు బుల్లితెర మీద సైతం రికార్డులని క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు టెలివిజన్ పై రెండు సార్లు టెలిక్యాస్ట్ అయిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో రేటింగ్స్ దక్కించుకుంది. అయితే తెలుగులోనే కాకుండా కన్నడలో సైతం సరికొత్త రికార్డు సృష్టించింది.

మేజర్ అజయ్ క్రిష్ణ గా కన్నడలో అనువాదం అయిన ఈ చిత్రం ఇటీవల కన్నడ టెలివిజన్లో టెలిక్యాస్ట్ అయ్యి 6.5 రేటింగ్స్ ని దక్కించుకుంది. ఒక తెలుగు సినిమా ఈ రేంజిలో రేటింగ్స్ తెచ్చుకోవడం ఇదే ప్రథమం. అంతకుముందు ఆ రికార్డు చిరంజీవి సైరా నరసింహారెడ్డి పేరు మీదుండేది. 6.3 రేటింగ్స్ తో కన్నడలో టాప్ రేటింగ్స్ అందుకున్న చిరంజీవిని సరిలేరు నీకెవ్వరు సినిమాతో దాటిపోయాడు. మొత్తానికి సినిమా వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా రికార్డులు మాత్రం ఆగడం లేదు.

Mahesh Babu created a new record:

Mahesh Babu created a new record

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ