అదేమిటి రాజకీయాలతో ఫుల్ బిజీ అయిన టైంలోను జబర్దస్ ని వదలని రోజా.. ఇప్పుడు జబర్దస్త్ ని వదిలెయ్యడం ఏమిటా అనికుంటున్నారా... అవునండి. రోజాకి బాగా కాలే ప్రశ్న వేస్తే అలానే ఫైర్ అవుతుంది మరి. రాజకీయాల్లో యమా బిజీగా ఉన్న టైంలోనే రోజా జబర్దస్త్ జడ్జ్ గా తన ప్రతాపం చూపించింది. మధ్యలో మరో జడ్జి నాగబాబు వెళ్ళిపోయినా రోజా సింగిల్ హ్యాండ్‌తో జబర్దస్త్ ని మెయింటైన్ చేస్తుంది. అలాంటి రోజా జబర్దస్త్ ని వదిలెయ్యడం అనేది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే తాజాగా ఓ మీడియా పర్సన్.. ఎమ్యెల్యేగా ఉన్న మీరు ఇప్పుడు APIIC ఛైర్ పర్సన్ కూడా. అలాంటి మీరు జబర్దస్త్ లో స్టేజ్ మీద మోడరన్ డ్రెస్సుల్తో డాన్స్ వెయ్యడం ఏమిటి అని అడగగానే ఫైర్ బ్రాండ్ మాదిరిగా రోజా ఓ రేంజ్ లో మీడియా మీద ఫైర్ అయ్యింది. తనకి మీడియా అంటే చాలా గౌరవం అని.. అయినా మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్ కి లేని బాధ మీకెందుకు అంటూ మీడియాకి సూటి ప్రశ్న వేసింది.
తాను ఏం చేసినా అది తన ఆత్మ సంతృప్తి కోసమే అని.. రాజకీయాలు జబర్దస్త్ తనకి రెండు కళ్ళు మాదిరి అని చెబుతుంది. తనకి సినిమా ప్రొఫెషన్ అయితే.. రాజకీయాలు ప్రాణం అంటుంది. తనకు నటిగా ప్రజల గుండెల్లో స్థానం ఇచ్చారని దానిని నిలబెట్టుకుంటామని చెబుతుంది రోజా. అయినా తాను రెండోసారి ఎమ్యెల్యేగా గెలిచాక స్టేజ్ మీద డాన్స్ చెయ్యకుండా డీసెంట్ గా సీట్ లోనే కూర్చుంటున్నా అని చెబుతుంది రోజా. జబర్దస్త్ లో నేను జడ్జిగా ఉండడం అనేది మా నాయకుడికి తెలుసనీ.. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా మారితే జబర్దస్త్ ని వదిలేస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అయినా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చెయ్యలేదా... బాలయ్య ఎమ్యెల్యేగా చేస్తూనే సినిమాల్లో డాన్స్ లు చెయ్యడం లేదా.. పవన్, చిరు రాజకీయాల్లో ఉండి సినిమాలు చేసుకోవడం లేదా.. వాళ్ళకో న్యాయం నాకో న్యాయమా అంటూ ఎదురు ప్రశ్న వేస్తుంది.
ఎవరెన్ని ట్రోల్స్ చేసినా దాన్ని నేను పట్టించుకోనని.. జబర్దస్త్, రాజకీయాలు రెండు కళ్ళని.. దేన్నీ వదులుకోనని.. రాజకీయాల్లో ఖర్చుపెట్టడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తడంతోనే మళ్లీ యాక్ట్ చేయాల్సి వచ్చిందని.. అందుకే జబర్దస్త్ ని వీడలేదని.. అలాగే తన మానసిక సంతృప్తి కోసం కూడా నటిస్తున్నట్లు తెలిపింది. ఏదేమైనా కూడా అవసరం అనుకుంటే తాను ప్రజల కోసం అన్నీ వదిలేయడానికి సిద్ధమే అంటూ తనని ట్రోల్ చేసే వాళ్ళకి సవాల్ విసిరింది రోజా.