ఎన్టీఆర్ అంటే మాస్ హీరోగానే లైక్ చేస్తారు ఆయన అభిమానులు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కన్నా ఎన్టీఆర్ మాస్ చిత్రాలు చేస్తాడంటే ఆయన అభిమానులకు పండగే. అందుకే ఎన్టీఆర్ కూడా ఎక్కువగా మాస్ మాస్ అంటూ మాస్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఓ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ని ఎలా మిస్ చేసుకున్నాడో చెబుతున్నాడు. అప్పుడెప్పుడో లవర్ బాయ్ సిద్దార్ధ్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వచ్చిన బొమ్మరిల్లు సినిమా అటు మ్యూజిక్ పరంగానే కాదు... ఇటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గాను బ్లాక్ బస్టర్ అయిన చిత్రం. అలాంటి చిత్రం ముందు ఎన్టీఆర్ వద్దకే వచ్చిందట. నిర్మాత దిల్ రాజు ఆ కథను ముందు ఎన్టీఆర్‌కే వినిపించాడట. ఆ సినిమా స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి బాగా నచ్చినా.. తనకున్న ఇమేజ్ కారణంగా ఆ సినిమా చెయ్యలేకపోయాడట.
తరవాత మంచి స్క్రిప్ట్ పోతుందే అని చాలా బాధపడ్డాడట ఎన్టీఆర్. నాకున్న ఇమేజ్ తో ఆ సినిమాకి న్యాయం చెయ్యలేననిపించింది. ఎన్టీఆర్ సినిమాలంటే డాన్స్ లు, ఫైట్స్, కామెడీ, హీరోయిజంతో పాటుగా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయనుకుని ప్రేక్షకులు, అభిమానులు థియేటర్స్ కి వస్తారు. కాని అవేమి లేకుండా నేను సినిమా చేస్తే అది అభిమానులను మోసం చెయ్యడమే కాదు.. ఆ సినిమాని నేను న్యాయం చేయలేను అని చెబుతున్నాడు ఎన్టీఆర్.
మరి ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ తో సిద్దార్ధ్ మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమాలో సిద్దార్ద్ నటనతో పాటుగా జెనీలియా నటన, ప్రకాష్ రాజ్ నటన, కోట నటన అన్ని హైలెట్ అయిన అంశాలు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, భాస్కర్ మేకింగ్ స్టయిల్ అన్ని బొమ్మరిల్లు సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది. మరి అలాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎన్టీఆర్ వదులుకుని తప్పు చేసాడేమో..!