సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బ్యాంకు మోసాల నేపథ్యంలో ఉండనుందట. అందుకోసం బ్యాంకు సెట్ ని కూడా నిర్మించే పనిలో ఉన్నారని సమాచారం. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అక్టోబర్ లేదా నవంబర్ లో సర్కారు వారి పాట చిత్రీకరణ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.
మాస్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మాస్ అంశాలు చాలా ఉండనున్నాయని డైరెక్టర్ పరశురామ్ వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు చాలా ఉంటాయట. అయితే సర్కారు వారి పాట సినిమా నుండి అప్డేట్ వస్తుందట. మహేష్ బాబు పుట్టినరోజుని పురస్కరించుకుని ఆగస్టు 9వ తేదీన సర్కారు వారి పాట టైటిల్ ట్రాక్ లేదా మహేష్ వాయిస్ ఓవర్ తో సర్కారు వారి పాట కథని తెలియజేసేలా గ్లింప్స్ ని వదులుతారని వినబడుతోంది.
అయితే రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కాంబో సినిమాపై ఎలాంటి అప్డేట్ రావడానికి అవకాశం లేదు. అందువల్ల అభిమానులు నిరాశ పడకుండా సర్కారు వారి పాట సర్ప్రైజ్ తో సరిపెట్టుకోవాలని సోషల్ మీడియా వేదికగా సలహా ఇస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సర్కారు వారి పాట టైటిల్ ట్రాక్ పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. మరి అనుకున్నట్టే సర్కారు వారి పాట సర్ప్రైజ్ చేస్తుందా లేదా చూడాలి.