Advertisementt

ఖైదీ దర్శకుడిని చరణ్ ఓకే చేస్తాడా..?

Wed 05th Aug 2020 08:46 AM
ram charan,khaidi,lokesh kanagaraj,mythri movie makers,karthi  ఖైదీ దర్శకుడిని చరణ్ ఓకే చేస్తాడా..?
Will Charan do film with Khadi director..? ఖైదీ దర్శకుడిని చరణ్ ఓకే చేస్తాడా..?
Advertisement
Ads by CJ

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న రామ్ చరణ్, తన నెక్స్ట్ సినిమా విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. గత కొన్ని రోజులుగా చరణ్ తర్వాతి చిత్రం గురించి అనేక కథనాలు వస్తున్నాయి. వంశీ పైడిపల్లి, సుకుమార్, కొరటాల శివ ఇంకా ఇతర దర్శకుల పేర్లు చాలానే వినిపించినప్పటికీ ఏదీ కన్ఫర్మ్ కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఖైదీ దర్శకుడితో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హీరోయిన్ లేకుండానే తెరకెక్కించారు. అయితే ఖైదీ హిట్ అవడంతో వెంటనే కనగరాజ్ కి తమిళ హీరో విజయ్ దొరికాడు. విజయ్ తో చేసిన మాస్టర్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా విడుదలై హిట్టు పడితే లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడు. అయితే ఈ డైరెక్టర్ ని మైత్రీ మూవీ మేకర్స్ లాక్ చేసిందని సమాచారం.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయాలని మైత్రీ ప్లానింగ్ లో ఉందట. అన్నీ కుదిరితే లోకేష్ డైరెక్షన్ లోనే ఈ సినిమా ఉంటుందని వినబడుతుంది. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న చరణ్ కోసం లోకేష్ సరైన స్క్రిప్టు రెడీ చేస్తే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ దానికి చాలా టైమ్ పట్టేలా ఉంది.

Will Charan do film with Khadi director..?:

Will Charan do film with Khadi director..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ