బిగ్ బాస్ నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. మూడవ సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున నాలుగ సీజన్ కి కూడా హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ విషయమై ఆల్రెడీ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. బిగ్ బాస్ ప్రోమో షూటింగ్స్ లో పాల్గొన్న నాగార్జున, ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని షేర్ చేసాడు. అయితే ఇప్పటి వరకూ మూడు సీజన్లలో జరిగిన మాదిరిగా కాకుండా ఈ సారి బిగ్ బాస్ లో చాలా మార్పులు ఉండబోతున్నాయట.
కరోనా కారణంగా జాగ్రత్తలు పాటించాల్సిన నేపథ్యంలో రూల్స్ అన్నీ చాలా కఠినంగా ఉంటాయట. భౌతిక దూరం పాటింస్తూనే టాస్కులు పెట్టనున్నారట. అయితే బిగ్ బాస్ షోలో ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, ఒకరి ప్రవర్తన గురించి మరొకరి వద్ద చెప్పడం, అవతలి వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పరుషంగా మాట్లాడడం జరుగుతుంటుంది. గత మూడు సీజన్లలో ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి.
అయితే నాలుగవ సీజన్లో అవేవీ ఉండకపోవచ్చని సమాచారం. ఈ విషయమై నాగార్జున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. కరోనా కారణంగా బయట నెగెటివిటీ విస్తరిస్తున్న క్రమంలో బిగ్ బాస్ షో చూసే వారికి నెగెటివ్ ఫీలింగ్ రానివ్వకుండా చేయడానికి అలాంటి వాటి జోలికి పోవద్దని చెప్పాడట. ప్రేక్షకులని అచ్చమైన వినోదం అందించడానికే ప్రయత్నించాలని కోరాడట. చూడాలి మరి ఏం జరగనుందో..!