Advertisementt

నీరజ కోన కూడా రంగంలోకి దిగుతోంది

Wed 05th Aug 2020 09:56 PM
neeraja kona,new avatar,director,story,stylish,interview  నీరజ కోన కూడా రంగంలోకి దిగుతోంది
Popular Stylist Neeraja Kona Ready To Don A New Avatar నీరజ కోన కూడా రంగంలోకి దిగుతోంది
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో నీరజ కోన పరిచయం అక్కర్లేని పేరు. కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా నీరజ కోనకి మంచి పేరుండడమే కాదు. సమంత, రకుల్, నితిన్ లాంటి స్టార్స్‌కి స్టైలిస్ట్ గా నీరజ కోన బాగా ఫేమస్. అలాగే నితిన్ కి బెస్ట్ ఫ్రెండ్ కూడా. నితిన్ పెళ్ళిలో నీరజ కోన హడావిడి ఎలా ఉందో బయటికొచ్చిన ఫొటోస్ లోనే చూసేసాం. అయితే నీరజ కోనకి హైదరాబాదులో ఓ ఫుడ్ రెస్టారెంట్ కూడా ఉంది. అందుకే రకరకాల వంటలు ట్రై చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా లాక్ డౌన్ లో వెరైటీ వంటలు ట్రై చేశాను అని చెబుతున్న నీరజ కోన దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి అని చెబుతుంది. అంటే ఫ్యూచర్ లో దర్శకత్వం చేసే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పేసింది. త్వరలోనే ఓ చిత్రానికి డైరెక్షన్ చేస్తా అని.. తన దగ్గర ఒక ప్రణాళిక ఉందని, ప్రస్తుతానికి తాను డైరెక్ట్ చెయ్యబోయే మొదటి చిత్రం కోసం కొంతమంది నటులను సంప్రదిస్తున్నట్లుగా చెప్పింది నీరజ కోన. మరి నీరజ కోన చేతికి దొరకబోయే ఆ యంగ్ హీరో ఎవరో చూడాలి. ఇక నీరజ కోన తెలుగులోనే కాదు... తమిళ హీరోలైన విజయ్, కార్తీ, సూర్య లాంటి స్టార్ హీరోలకు స్టైలిస్ట్ గా పని చేసింది.

మరి నితిన్ తో తనకి ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. నితిన్ వివాహం చేసుకున్నందున చాలా సంతోషంగా ఉందని.. నిజానికి నితిన్ తన ప్రేమ కథను మా అందరికి చెప్పకుండా దాచిపెట్టాడని ఆమె తెలిపింది. ఈ లవ్ మ్యారేజ్‌తో అందరికీ షాక్ ఇచ్చాడు అని చెబుతుంది. ఇక నీరజ కోన ఎప్పుడు హిందీ ఫ్యాషన్ అంటే చాలా ఇష్టపడుతుందట.. పెద్ద పెద్ద ఫ్యాషన్ ఛానల్స్ వారు, పెద్ద పెద్ద పత్రికల వారు తెలుగు హీరో హీరోయిన్స్ ని ఎందుకు సంప్రదించరో అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు తన ఫ్యాషన్స్ వలన కొన్ని పత్రికల వారు తెలుగు తారలను ఫ్యాషన్ గురించి సంప్రదిస్తున్నారని చెబుతుంది నీరజ కోన.

Popular Stylist Neeraja Kona Ready To Don A New Avatar:

Neeraja Kona turns director soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ