ఇప్పుడు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలోనూ అల్లు అర్జున్ చేసిన ఓ పని గురించి తెగ చర్చించేస్తున్నారు. ఆదేమిటంటే అల్లు అర్జున్ - కొరటాల కాంబో మూవీపై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి.. సోషల్ మీడియాలో ఆ కాంబోపై రకరకాల న్యూస్ లు ప్రచారం లోకొచ్చాయి. అల్లు అర్జున్ తెలివైనవాడు కాబట్టే పుష్ప లైన్ లో ఉండగానే ఐకాన్ ని పక్కనబెట్టి కొరటాలతో పాన్ ఇండియా మూవీ కమిట్ చేయించాడు అంటే... కొరటాల చెప్పిన కథకి బన్నీ పడిపోయాడని, విశాఖ గ్యాస్ ఉదంతం నేపథ్యంలో కొరటాల - అల్లు అర్జున్ మూవీ ఉండబోతుంది అని.. పల్లెటూరికి - పట్నానికి మధ్య వ్యత్యాసాలని కొరటాల తనదైన స్టయిల్లో చూపించబోతున్నాడని ఇలా రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అయితే ఈలోపు అసలు బన్నీ... కొరటాల కథ చెప్పకుండానే మూవీ కమిట్ అయ్యాడని.. కొరటాల ఎలాంటి కథ చెప్పకపోయినా అల్లు అర్జున్ కొరటాల మీద నమ్మకంతో ఈ సినిమా ని సెట్ చేసాడనే టాక్ మొదలైంది. అసలు అల్లు అర్జున్ మొదటినుండి దర్శకుడిపై నమ్మకం ఉంచి ప్రాజెక్టు ఓకే చేసేస్తాడు అనే టాక్ ఉండనే ఉంది. కథ లేకపోయినా కమిట్ అయితే తరవాత కథ దానంతట అదే పుట్టుకొస్తుందన్న ధీమా బన్నీది అంటున్నారు. త్రివిక్రమ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన అల వైకుంఠపురములో కథ కూడా బన్నీ ముందు వినలేదని అంటున్నారు. తర్వాత పుష్ప కథ కన్నా సుక్కు మీద నమ్మకంతోనే అల్లు అర్జున్ ఆ సినిమా ఒప్పుకున్నాడని.. కథ విన్నాక నమ్మకం వచ్చి దాన్ని పాన్ ఇండియా సినిమాగా మార్చాడని అంటున్నారు. ఇక ఇప్పుడు కొరటాల కథ కూడా అంతే అని.. కొరటాల మీదున్న నమ్మకంతోనే అల్లు అర్జున్ కథ వినకుండానే సినిమా ఓకే చేసాడని అంటున్నారు.