Advertisementt

అఖిల్ కౌ బాయ్ ఫోటో వెనక ఆసక్తికర కథనం..

Tue 04th Aug 2020 06:51 PM
akhil akkineni,mosteligible bachelour,pooja hegde,mahesh babu  అఖిల్ కౌ బాయ్ ఫోటో వెనక ఆసక్తికర కథనం..
Interesting story behind Akhils photo అఖిల్ కౌ బాయ్ ఫోటో వెనక ఆసక్తికర కథనం..
Advertisement
Ads by CJ

అక్కినేని వారసుడు అఖిల్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మొన్నటికి మొన్న ఈ సినిమా నుండి పోస్టర్ రిలీజై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే తాజాగా అఖిల్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

కౌ బాయ్ గెటప్ లో అఖిల్ చిన్నప్పటి ఫోటో బయటకి వచ్చింది. కౌ బాయ్ గెటప్ లో ఒక చేతిలో గన్ను, తల మీద హ్యాటు పెట్టుకుని చూడముచ్చటగా ఉన్న ఈ ఫోటో ఎలా బయటకి వచ్చిందో తెలియదు గానీ అందరికీ బాగా నచ్చేసింది. అయితే ఈ ఫోటో వెనక ఓ ఆసక్తికర కథనం ఉందట. మహేష్ బాబు హీరోగా నటించిన టక్కరి  దొంగ సినిమా అందరికీ గుర్తే. ఆ సినిమాలో మహేష్  కౌ బాయ్ గెటప్ లో కనిపిస్తాడు. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అఖిల్ ఆ సెట్ కి  వెళ్లాడట. ఆ టైమ్ లో సరదాగా గన్ను, హ్యాటు పట్టుకుని ఫోజిచ్చాడట. అప్పుటి  సరదా  ఫోటో ఇప్పుడు  వైరల్ గా మారింది. 

Interesting story behind Akhils photo:

Interesting story behind Akhils photo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ