పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండతో చేస్తున్న పాన్ ఇండియా మూవీ కోసం బాలీవుడ్ లేత అందాలు అనన్య పాండేని హీరోయిన్ గా తీసుకున్నారు. విజయ్ దేవరకొండ - అనన్య పాండే కెమిస్ట్రీ అదుర్స్ అన్న రేంజ్ లో విజయ్ సినిమా పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. లేత అందాలు, గ్లామర్ గర్ల్, హాట్ హీరోయిన్ అనన్య పాండే అంటే సౌత్ లో ఓ అన్నంత పేరు లేదు. కానీ విజయ్ దేవరకొండతో చేస్తున్న మూవీతో అనన్య పాండే ఒక్కసారిగా సౌత్ లో ఫేమస్ అయ్యింది. ఇక తర్వాత అనన్య సౌత్ సినిమాలు చేస్తుంది అనే టాక్ నడుస్తుంది. పూరి కనెక్ట్స్ తో అగ్రిమెంట్ కూడా చేసుకుంది. అందుకే ఛార్మి అండ్ పూరిలు అనన్యని సౌత్ లో దింపే ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు.
అయితే తాజాగా అనన్య పాండేని మహేష్ మూవీలో హీరోయిన్ గా సంప్రదిస్తున్నారని అంటున్నారు. పరశురామ్ - మహేష్ కాంబోలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట సినిమాలో అనన్య పాండేని సెకండ్ హీరోయిన్ పాత్రకి సంప్రదిస్తున్నారట, మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసిన పరశురామ్ అండ్ టీం మహేష్ కోసం సెకండ్ హీరోయిన్ గా అనన్య పాండేని సంప్రదిస్తున్నారనే టాక్ నడుస్తుంది. మరి అసలే సౌత్ సినిమా అందులోను సెకండ్ హీరోయిన్ పాత్ర అనన్య పాండే ఒప్పుకోవాలి. ఏమో మహేష్ కదా ఒప్పుకున్నా ఆశ్చర్య పడక్కర్లేదంటున్నారు.