Advertisementt

తెరపైకి స్టార్ హీరోయిన్ జీవితం..?

Tue 04th Aug 2020 09:52 AM
aarti agarwal,nuvvu naaku nacchav,venkatesh,tollywood,  తెరపైకి స్టార్ హీరోయిన్ జీవితం..?
Star heroine biopic coming soon..? తెరపైకి స్టార్ హీరోయిన్ జీవితం..?
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒక జోనర్ లో సినిమా హిట్ అయితే వరుసగా అదే జోనర్ లో సినిమాలు క్యూ కడుతుంటాయి. ఆ విధంగా గత కొన్ని రోజులుగా బయోపిక్ ల హవా నడుస్తుంది. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తల జీవితాలు తెరమీదకి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో జీవితాలు వెండితెరపై ఆవిష్కరించబడ్డాయి. అయితే తాజాగా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ జీవితంపై సినిమా రాబోతుందట. 

2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయిన ఆర్తి అగర్వాల్, కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పట్లో ఆమె చేసిన ప్రతీ సినిమా హిట్టు కావడంతో లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆర్తి మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. నువ్వు నాకు నచ్చావ్, ఇంద్ర, నువ్వులేక నేనులేను, నేనున్నాను వంటి సూపర్ హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

అయితే దురదృష్టవశాత్తు 2015లో కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆర్తి అగర్వాల్ తుదిశ్వాస విడిచింది. ఆర్తి చివరి చిత్రమైన ఆమె ఎవరు 2016లో రిలీజైంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి స్టార్లందరి సరసన నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసిన ఆర్తి అగర్వాల్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ బయోపిక్ ని ఎవరు తెరకెక్కిస్తారో చూడాలి.

Star heroine biopic coming soon..?:

Star heroine biopic coming soon..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ