Advertisementt

సుకుమార్ ఆ విషయంలో తొందరపడాల్సిందేనా..?

Tue 04th Aug 2020 09:33 AM
sukumar,bunny,allu arjun,pushpa,ram charan  సుకుమార్ ఆ విషయంలో తొందరపడాల్సిందేనా..?
Sukumars next movie with whom..? సుకుమార్ ఆ విషయంలో తొందరపడాల్సిందేనా..?
Advertisement
Ads by CJ

రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసిన సుకుమార్, అల వైకుంఠపురములో సినిమాతో రంగస్థలం రికార్డుని బద్దలు కొట్టిన అల్లు అర్జున్ తో జోడీ కట్టి పుష్ప సినిమా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని బన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా అనంతరం బన్నీ, కొరటాల దర్శకత్వంలో చేసేందుకు సిద్ధం అయ్యాడు.

అయితే బన్నీ నెక్స్ట్ సినిమా కొరటాలతో అని ప్రకటించినప్పటి నుండి దర్శకుడిగా సుకుమార్ తర్వాతి చిత్రం ఎవరితో ఉండనుందనే విషయమై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రంగస్థలం తర్వాత ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్న సుకుమార్, ఈ సారి అలా కాకూడదని అనుకుంటున్నాడట. అందుకే తన నెక్స్ట్ హీరోని లాక్ చేసేందుకు తొందరపడుతున్నాడని టాక్. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలందరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

వారంతా మరో రెండు మూడేళ్లపాటు దొరికేలా లేరు. ఇక నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయనిది చరణ్ ఒక్కడే. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ సినిమా ఏంటనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అందువల్ల సుకుమార్ చరణ్ ని లాక్ చేసేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. రంగస్థలం తో సంచలనం సృష్టించిన ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయితే అభిమానులకి పండగే. మరి సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి.

Sukumars next movie with whom..?:

Sukumars next movie with whom..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ