Advertisementt

ఆ అమ్మడుకి స్టార్ హీరోలే కావాలట..?

Mon 03rd Aug 2020 09:08 PM
pooja hegde,nithin,andhadhun,star heroes  ఆ అమ్మడుకి స్టార్ హీరోలే కావాలట..?
Is Pooja Hegdes Decision is Right..? ఆ అమ్మడుకి స్టార్ హీరోలే కావాలట..?
Advertisement
Ads by CJ

వరుసగా మూడు పెద్ద హిట్లు అందుకున్న తర్వాత పూజా హెగ్డే రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో వంటి వాటితో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన ఏకైక ఛాయిస్ గా మారిపోయింది. తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ భామ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ లో నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాతో పూజా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

రాధేశ్యామ్ తో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ చిత్రంలో నటిస్తున్న పూజా హెగ్డే, ఆ తర్వాత చిన్న హీరోలతో నటించాలని అనుకోవడం లేదట. మొన్నటికి మొన్న నితిన్ సరసన అంధాధున్ రీమేక్ లో నటించడానికి అడిగినపుడు సున్నితంగా తిరస్కరించిందట. పూజా అడిగినంత పారితోషికం ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా చిన్న, మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి ఇష్టపడటం లేదట.

ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు వస్తుండడంతో ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందువల్ల కేవలం స్టార్స్ తో మాత్రమే సినిమాలు చేస్తానంటే తొందరగా కెరీర్ ముగిసిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా అటు పెద్ద సినిమాలతో పాటు చిన్న, మధ్య తరహా సినిమాలు చేస్తే ఎక్కువ కాలం లైఫ్ ఉంటుందని సలహా ఇస్తున్నారు. మరి పూజా ఎలా ప్లాన్ చేసుకుందో ఏమో..!

Is Pooja Hegdes Decision is Right..?:

Is Pooja Hegdes Decision is Right..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ