అల్లు అర్జున్‌కి నా పేరు సూర్య లాంటి అట్టర్ ప్లాప్ ఉన్నప్పటికీ.. త్రివికమ్‌తో అల వైకుంఠపురములో సినిమా తీసేటప్పుడు త్రివిక్రమ్‌తో తాను చెప్పిందే వేదంలా ఉండేలా మరీ ప్లాన్ చేసుకుని.. త్రివిక్రమ్ ఓన్ బ్యానర్ లాంటి హారిక హాసిని వారి మెడలు వంచి గీతా ఆర్ట్స్ బ్యానర్ కి వాటా ఇప్పించి బ్లాక్ బస్టర్ లాభాలను పంచేసుకున్నారు. త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ చెప్పింది చెప్పినట్టు వినడానికి కారణం అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ తర్వాత అరవింద సమేత సో సో మూవీ కావడంతో త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ కండీషన్స్‌కి తలొగ్గాడు. అందులోను స్టార్ రేంజ్ ఉన్న హీరోతో సినిమా అవసరం కాబట్టి త్రివిక్రమ్ తలొంచాడు. అక్కడ అల్లు అర్జున్ ఏం చెబితే అదే నడిచింది. ఇక పుష్ప విషయంలోనూ అల్లు అర్జున్ చెప్పిందే జరిగింది.
సుకుమార్‌కి రంగస్థలం అలాంటి బ్లాక్ బస్టర్ ఉంది. కానీ మహేష్ తనని రిజెక్ట్ చెయ్యడంతో అల్లు అర్జున్‌కి కథ చెప్పి ఒప్పించినా అక్కడ కూడా అల్లు అర్జున్ డామినేషన్ వర్కౌట్ అయ్యింది. అందులోను మైత్రీ మూవీస్ వారికీ అల్లు అర్జున్ చుట్టాలని వాటాకి ఇరికించాడు. కానీ ఇప్పుడు కొరటాల దగ్గర మాత్రం అల్లు అర్జున్ పప్పులు ఉడకడం లేదని తెలుస్తుంది. కారణం కొరటాల ఇలాంటి లాభాలు, వాటాల దగ్గర చాలా నిక్కచ్చిగా ఉంటాడు. అల్లు అర్జున్ ఆటలు కొరటాల దగ్గర సాగకపోవడానికి కారణం కొరటాల దగ్గరికి అల్లు అర్జున్ వెల్లడమేనట.
దర్శకులంతా హీరోలను వెతుక్కుని వెళుతుంటే అల్లు అర్జున్ మాత్రం తానే మంచి డైరెక్టర్స్‌ని లాక్ చేస్తూ ఉంటాడు. అలా కొరటాలని కూడా పుష్ప తర్వాత కావాలని లాక్ చెయ్యడంతోనే అల్లు అర్జున్‌కి కొరటాల దగ్గర కండిషన్స్ అప్లై చెయ్యడానికి కుదరడం లేదట. కొరటాలతో ఎలాగైనా సినిమా చెయ్యాలనే తపనతోనే అల్లు అర్జున్ ఇలా చేసాడంటున్నారు. అయినా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి నిర్మాణ భాగస్వామ్యంలో వాటా కలిపినా.. కొరటాల వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతవరకే ఇస్తున్నాడట.