Advertisementt

గోపీచంద్ సీటీమార్ సంక్రాంతికేనా..?

Mon 03rd Aug 2020 08:42 AM
gopichand,seetimaar,tamannah,sampath nandi,coronavirus,covid 19  గోపీచంద్ సీటీమార్ సంక్రాంతికేనా..?
Will Seetimaar release in Sankranti Season..? గోపీచంద్ సీటీమార్ సంక్రాంతికేనా..?
Advertisement
Ads by CJ

కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో సినిమా షూటింగులేవీ మొదలు కావట్లేదు. కరోనాకి భయపడి రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి చిత్రీకరణ కోసం అనుమతులు తెచ్చుకున్నప్పటికీ పెద్ద సినిమాల షూటింగ్స్ ఇంకా మొదలు కావట్లేదు. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాతే షూటింగ్స్ ప్రారంభించాలని అనుకుంటున్నారు.

అలా అనుకుంటున్న వారిలో గోపీచంద్ కూడా చేరాడు. సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో సీటీమార్ అనే టైటిల్ తో సినిమా చేస్తున్న గోపీచంద్, ఇప్పట్లో షూటింగ్స్ కి రానని చెప్పేసాడట. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో కబడ్డీ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. ప్రస్తుత పరిస్తితుల్లో కబడ్డీ సన్నివేశాలు చిత్రీకరించడం పెద్ద సవాలే. అందువల్ల కరోనా నియంత్రణలోకి వచ్చే వరకూ వెయిట్ చేయాలని చూస్తున్నారట.

అంటే మరో రెండు మూడు నెలల వరకీ షూటింగ్ స్టార్ట్ కాదన్న మాట. ఈ లెక్కన ఆ తర్వాత చిత్రీకరణ మొదలు పెట్టినా పూర్తవడానికి చాలానే టైమ్ పడుతుంది. అంతా పూర్తిచేసుకుని రిలీజ్ చేద్దామనే టైమ్ కి సంక్రాంతి సీజన్ వచ్చేస్తుంది. కాబట్టి సీటీమార్ కూడా సంక్రాంతికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలోకి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి వాటన్నింటి మధ్యలో సీటీమార్ ని దించుతారా లేదా చక చకా కంప్లీట్ చేసుకుని అంతకుముందే రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Will Seetimaar release in Sankranti Season..?:

Will Seetimaar release in Sankranti Season..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ