Advertisementt

క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్.. ఇప్పట్లో వస్తుందా..?

Mon 03rd Aug 2020 08:22 AM
nani,maruti,shiva nirvana,rahul sankrityayan,shyam shinga roy  క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్.. ఇప్పట్లో వస్తుందా..?
Crazy combo repeat.. will it come soon..? క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్.. ఇప్పట్లో వస్తుందా..?
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ద్వారానే నాని మార్కెట్ బాగా పెరిగింది. అయితే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ కాంబినేషన్ పై వార్తలు వస్తున్న మాట నిజమే. నాని అభిమానులు కూడా ఈ కాంబినేషన్ మళ్లీ కుదరాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే వీరిద్దరి కాంబినేషన్ కుదిరినా కూడా ప్రస్తుతం నాని చేతుల్లో ఉన్న సినిమాలని చూస్తుంటే ఇప్పట్లో ఖాళీ అయ్యేలా లేడు. శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్న నాని, ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రిత్యాయన్ రూపొందిస్తున్న శ్యామ్ సింగరాయ్ లో నటిస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాల అనంతరం రామ్ చరణ్ రంగస్థలం చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేసిన కొత్త దర్శకుడితో చేయనున్నాడని వార్తలు వచ్చాయి.

ఈ సినిమాలన్నీ పూర్తవ్వాలంటే కనీసం రెండేళ్లయినా పడుతుంది. మరి మారుతితో సినిమా అంటే రెండేళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే. లేదంటే ఈ సినిమాల్లో ఏదో ఒక సినిమాని పక్కన పెట్టి మారుతితో పనిచేయాలి. మరి నాని ఏం చేస్తాడో చూడాలి.

Crazy combo repeat.. will it come soon..?:

Crazy combo repeat.. will it come soon..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ