రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. నిజ జీవిత పాత్రలని తీసుకుని కల్పిత కథగా రూపొందిస్తున్న ఈ సినిమా సంచలనం సృష్టించబోతుందని నమ్ముతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా తాత్కాలికంగా ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ మొదలవుతుంది. అయితే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
దాంతో ఎన్టీఆర్ లుక్ పై అంచనాలు మరింతగా పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పలు రకాల గెటప్స్ లో కనిపిస్తాడట. శత్రువులని డైవర్ట్ చేయడానికి వివిధ రకాల వేషాలు వేస్తూ ఉంటాడట. అందువల్ల ఎన్టీఆర్ ఐదారు గెటప్స్ లో కనిపించనున్నాడని అంటున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలివియా మోరిస్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందట. గిరిజన యువతిగా కనిపించే ఆ హీరోయిన్ ఎన్టీఆర్ పాత్రని ప్రేమిస్తుందని చెబుతున్నారు.
మరి ఆ హీరోయిన్ ఎవరనేది ఇంకా వెల్లడి చేయలేదు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియా, రాహుల్ రామక్రిష్ణ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.