Advertisementt

అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా.. దిల్‌రాజు!

Mon 03rd Aug 2020 01:14 AM
dil raju,orphans,manohar,lasya,yashwanth,adopts  అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా.. దిల్‌రాజు!
Telugu producer Dil Raju adopts three orphans అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా.. దిల్‌రాజు!
Advertisement
Ads by CJ

అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని కోరిన మంత్రి ఎర్ర‌బెల్లి.. పిల్ల‌ల‌కు బాస‌ట‌గా నిలిచిన దిల్‌రాజు

తెలుగు అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు త‌న స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు. అనాథ‌లైన ముగ్గురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. వివ‌రాల్లోకెళ్తే..  యాదాద్రి జిల్లా ఆత్మ‌కూరు గ్రామంలో గ‌ట్టు స‌త్త‌య్య ఏడాది క్రితం అనారోగ్యంతో క‌న్నుమూశారు. భ‌ర్త‌పై బెంగ‌తో భార్య అనురాధ కూడా రెండు రోజుల క్రితం క‌న్నుమూశారు. త‌ల్లిదండ్రుల మ‌ర‌ణంతో పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్‌ అనాథ‌ల‌య్యారు. ఈ విష‌యాన్ని ఓ ఛానెల్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు, స‌ద‌రు గ్రామ స‌ర్పంచు, ఎమ్మెల్యేతో ఫోన్‌లో ప్ర‌త్యేకంగా మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. 

ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి కోరారు. మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు దిల్‌రాజు. త‌న కుటుంబం స్థాపించిన ‘మా ప‌ల్లె’ చారిటబుల్ ట్ర‌స్ట్ ద్వారా పిల్ల‌ల‌ బాగోగులను చూసుకుంటాన‌ని దిల్‌రాజు ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. అడ‌గ్గానే అనాథ‌ పిల్లలను దత్తత తీసుకున్న నిర్మాత దిల్ రాజుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.

Telugu producer Dil Raju adopts three orphans:

I am happy to welcome manohar, lasya and Yashwanth into my extended family says dil raju

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ